పింఛన్‌..టెన్షన్‌..!

ABN , First Publish Date - 2021-05-03T05:07:14+05:30 IST

పింఛన్‌దారులతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. వరుసగా మూడు నెలల పాటు పింఛన్‌ నగదు తీసుకోకపోతే ప్రభుత్వం వారి పింఛన్‌ను నిలిపివేస్తోంది. ఈ తతగం అద్దంకి మండలం ధ ర్మవరం గ్రామంలో జరుగుతోంది. ఇదంతా మండల స్థాయి అధికారి కనుసన్నలలో నడుస్తుందన్న విమర్శ లు వస్తున్నాయి.

పింఛన్‌..టెన్షన్‌..!
ధేనువకొండ జాబితాలో ఉన్న ధర్మవరం లబ్ధిదారుల పేర్లు

 ధర్మవరం పెన్షన్‌దారుల పేర్లు  ఇతర గ్రామాల జాబితాల్లో..

తొలగించటమే లక్ష్యంగా వ్యవహారం 

ఆందోళనలో  లబ్ధిదారులుఅద్దంకి, మే 2: పింఛన్‌దారులతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. వరుసగా మూడు నెలల పాటు పింఛన్‌ నగదు తీసుకోకపోతే ప్రభుత్వం వారి పింఛన్‌ను నిలిపివేస్తోంది. ఈ తతగం అద్దంకి మండలం ధ ర్మవరం గ్రామంలో జరుగుతోంది.  ఇదంతా  మండల స్థాయి అధికారి కనుసన్నలలో నడుస్తుందన్న విమర్శ లు వస్తున్నాయి. ఇప్పటికే  గ్రామంలో ఓ దివ్యాంగుడి కి పింఛన్‌ లేకుండా చేశారు. మరో 15 మంది పింఛన్‌లు తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. గత నె లలో ధర్మవరానికి చెందిన పలువురు పింఛన్‌దారుల  పేర్లు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అధికారు ల దృష్టికి తీసుకుపోగా ఎన్నికల హడావుడిలో ఉన్నామని, విచారించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. మే నెల జాబితాలో కూడా పింఛన్‌దారుల పేర్లు  లే వు. ఈ క్రమంలో లబ్ధిదారులు విచారించగా శంఖవరప్పాడు జాబితాలో ఏడుగురు, ధేనువకొండ జాబితాలో నలుగురు పేర్లు ఉన్నాయి. మరికొందరి పేర్లు ధర్మవ రం జాబితాలో ఉన్నప్పటికీ వేలు సరిగ్గా పడటం లేద ని గ్రామ వలంటీర్లు పింఛన్‌ నగదు ఇవ్వకుండా జా ప్యం చేస్తున్నారు. వలంటీర్లు వేరే వ్యక్తుల వేలిముద్ర లు పలు సార్లు వేయించి ఉండటంతో ఆరోజు ఆ ఫిం చన్‌దారుని తంబ్‌ పనిచేయకుండా పోతున్నది. దీని ద్వారా పింఛన్‌ పంపిణీ జరగకుండా నిలిచిపోతున్నది. ఇలా మార్చి, ఏప్రిల్‌ నెలల పంపిణీ జాబితాలో కొంత మంది పేర్లు ధర్మవరం జాబితో కనిపించ  లేదు. 


ధర్మవరం జాబితాలో లేని పేర్లు 


ధర్మవరం జాబితాలో లేని పేర్లు శంకవరప్పాడు, ధే నువకొండ గ్రామాల జాబితాలో ఉన్నట్లు, పింఛన్‌ నగ దు తీసుకోనట్లు నమోదు అయ్యి ఉంది. మే నెల జాబితాలో కూడా శంఖవరప్పాడు, ధేనువకొండ జాబితాల లో ఉన్నట్లు తెలుసుకున్న పింఛన్‌దారులు వ్యయ ప్ర యాసలకోర్చి ఆయా గ్రామాలకు వెళ్లి వలంటీర్లను పింఛన్‌ నగదు అడగ్గా ఇక్కడి వారికి మినహా అదన పు నగదు ఏమీ ఇవ్వలేదని చెప్పటంతో కంగుతిన్నారు. ధర్మవరంనకు చెందిన దివ్యాంగుడి ఫింఛన్‌ పొందుతు న్న ముప్పవరపు జాషువాకు మూడు నెలల నుంచి పింఛన్‌ నగదు ఇవ్వక పోవటంతో మే నెల లో  పింఛన్‌ రద్దయ్యింది. మి గిలిన వారిలో కూడా అ త్యధికులకు ఈ నెలతో మూడు నెలలు పూర్తవుతుండటంతో ఎక్కడ త మ పింఛన్‌ రద్దు అవుతుందన్న ఆందోళన నెలకొంది. ధర్మవరానికి చెం దిన నలుగురు పింఛన్‌దారుల పేర్లు సుమారు 40 కి. మీ దూరంలో ఉన్న ధేనువకొండ గ్రామ జాబితాలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని మ ండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పం దించటం లేదని పలువురు పింఛన్‌దారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పింఛన్‌ల నగదు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  


Updated Date - 2021-05-03T05:07:14+05:30 IST