పింఛన్‌ను సక్రమంగా అందజేయాలి
ABN , First Publish Date - 2021-02-02T05:02:19+05:30 IST
వృద్ధులకు సక్రమంగా పింఛన్ ను అందజేయాలని సచివాలయం జిల్లా పెన్షన్ విభాగ అధి కారి ఏపీ ఎం వరప్రసాద్ అన్నారు.

పెద్దారవీడు, ఫిబ్ర వరి 1: వృద్ధులకు సక్రమంగా పింఛన్ ను అందజేయాలని సచివాలయం జిల్లా పెన్షన్ విభాగ అధి కారి ఏపీ ఎం వరప్రసాద్ అన్నారు. మండలంలోని దేవరాజుగట్టు గ్రామ సచి వాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. రికార్డుల నిర్వ హణ, పింఛన్ పంపిణీని ఆయన పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశా రు. పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని సిబ్బందికి సూచించారు. అనంతరం పలు వురికి పింఛన్‌లను వర ప్రసాద్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలకోటయ్య, టి.సావిత్రి, వెంకటేశ్వరరెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.