పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-12-31T05:08:34+05:30 IST
పాఠశాల పారిశుధ్య కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు.

గిద్దలూరు, డిసెంబరు 30 : పాఠశాల పారిశుధ్య కార్మికులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. కరోనా మళ్లీ ఉధృ తం అవుతున్న దృష్ట్యా పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, చీపుర్లు ఇవ్వాలని కోరారు. మధ్యాహ్న భోజన కా ర్మికులకు కూడా పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రతినిధులు కుమారి, లక్ష్మీదేవి, నరసమ్మ, రమాదేవి పాల్గొన్నారు.