ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-02T05:23:37+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలుప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు వివేక్‌ యాదవ్‌ సూచించారు. అందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం తీసుకోవాలన్నారు. స్థానిక స్పందన భవన్‌లో సోమవారం ప్రత్యేకంగా నియమించిన స్క్వాడ్స్‌, స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌ టీంలు, ఎన్నికల వ్యయపరిశీలన బృంద సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు వివేక్‌ యాదవ్‌

- జిల్లా పరిశీలకుడు వివేక్‌యాదవ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 1 : గ్రామ పంచాయతీ ఎన్నికలుప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు వివేక్‌ యాదవ్‌ సూచించారు. అందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం తీసుకోవాలన్నారు. స్థానిక స్పందన భవన్‌లో సోమవారం ప్రత్యేకంగా నియమించిన స్క్వాడ్స్‌, స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌ టీంలు, ఎన్నికల వ్యయపరిశీలన బృంద సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల పరిస్థితిని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకుడి దృష్టికి తీసుకెళ్ళారు. ఒకటి, రెండు,మూడు విడతల్లో జరిగే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనే స్టేజ్‌-1 సిబ్బందికి ఇప్పటికే శిక్షణ  పూర్తి చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే స్టేజ్‌-2 సిబ్బందికి   త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు ఓఎ్‌సడీ చౌడేశ్వరి మాట్లాడుతూ రెగ్యులర్‌ పోలీస్‌ సిబ్బందితో పాటు కలెక్టర్‌ సూచనల మేరకు పారా పోలీస్‌ సిబ్బందికి కూడా ఎన్నికల విధులు కేటాయిస్తున్నామని తెలిపారు.సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, డీఆర్వో కేవినాయకం, డీపీవో జీవీ నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, స్టేట్‌ఆడిట్‌ విభాగం రీజనల్‌డిప్యూటీ డైరెక్టర్‌ రమే్‌షకుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం పాత రిమ్స్‌లో భద్ర పర్చిన బ్యాలెట్‌ పేపర్‌లను వివేక్‌ యాదవ్‌ పరిశీలించారు. 


Updated Date - 2021-02-02T05:23:37+05:30 IST