శాంతిభద్రతలు భేష్
ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST
జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణలో పోలీస్ శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఎస్పీ మలికగర్గ్ తెలిపారు.

వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఎస్పీ మలికగర్గ్
రోడ్డుప్రమాదాల నివారణకు చర్యలు
మహిళా భద్రతకు పెద్దపీట
మొబైల్ మిస్సింగ్‌కు ఫిర్యాదుల స్వీకరణ
ఒంగోలు(క్రైం), డిసెంబరు 30: జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణలో పోలీస్ శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఎస్పీ మలికగర్గ్ తెలిపారు. గురువారం స్థానికి పోలీస్ కార్యాలయం ఆవరణంలో గల గెలాక్సీ భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసి చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా మెగా లోక్‌అదాలత్‌లో ఈ ఏడాది 24,421 కేసులు పరిష్కరమయ్యే విధంగా కృషిచేయడంతో పాటు కీలకమైన కేసుల్లో నిందితులకు శిక్షపడే విధంగా జిల్లా పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేసులు నమోదు గతేడాది కంటే పెరిగిందన్నారు. ఈఏడాది 17,087 కేసులు నమోదైనట్లు తెలిపారు.
అలాగే ఈ ఏడాది రికవరీ 32శాతం పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు ని వారించేందుకు ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నో యాక్సిడెంట్ డే కార్యక్రమం చేపట్టడంతో ప్రమాదాల్లో మరణాల రేటు తగ్గించగలిగామని వివరించారు. గతేడాది మొత్తం ప్రమాదాలు 1,483 చోటుచేసుకోగా ఈ ఏడాది 1,440 జరిగా యన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను అదుపు చేస్తున్నా మని చెప్పారు. సెల్ ఫోన్ మిస్ అయితే వెంటనే స్టేషన్‌లలో ఫిర్యాదు చేసి రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మహిళల భద్రత విషయంలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి ఎలాంటి సమస్య ఉన్నా ఎమర్జెన్సీ కాల్‌కు ఫోన్ చేసే విధంగా చైతన్యవంతం చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టిసారించి 27 కేసులు నమోదు చేశామన్నారు. 72మందిని అరెస్టు చేసి 11 వాహనాలను సీజ్ చేసామని చెప్పారు. నూతన సంవత్సరంలో సరికొత్త పోలీ సింగ్‌కు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. అనంతరం 2022 పోలీసు క్యాలెండ ర్‌ను ఆవిష్కరించారు. ఓఎస్‌డీ కె.చౌడేశ్వరీ, ఏఆర్ ఏఎస్పీ అశోక్‌బాబు, డీఎస్పీ లు నాగరాజు, శ్రీకాంత్, నారాయణస్వామిరెడ్డి, కె,శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర రావు, డీసీఆర్‌బీ సీఐ మోయిన్, ఆర్‌ఐలు శ్రీహరిరెడ్డి, శ్రీకాంత్ నాయక్, హరిబాబు, ఎస్సై అజయ్‌కుమార్ పాల్గొన్నారు.