పర్యావరణాన్ని పరిరక్షించండి

ABN , First Publish Date - 2021-01-21T05:24:46+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి కో రారు.

పర్యావరణాన్ని పరిరక్షించండి
ఉగ్ర పర్యవేక్షణలో మొక్కలు నాటుతున్న ఇంద్రభూపాల్‌


కనిగిరి, జనవరి 20: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంద్రభూపాల్‌రెడ్డి కో రారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి పర్యవేక్షణలో కనిగిరిలో పలు చోట్ల మొక్కలు నాటారు.   ఉగ్ర పిలుపు మేరకు విరివిగా రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇంద్రభూపాల్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు వేడుకలు మాదిరిగానే మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే ప్రజలకు ఆరోగ్యాన్ని అందించిన వారిమవుతామని  ఆయన పేర్కొన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఉండేల పిచ్చిరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, బారా ఇమాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T05:24:46+05:30 IST