పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-06-06T06:55:06+05:30 IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మార్కాపురం డీఎ్‌ఫవో బబిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎ్‌ఫవో కార్యాలయంలో శనివారం ఆమె మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మొక్కలు నాటుతున్న డీఎ్‌ఫవో బబిత

డీఎ్‌ఫవో బబిత

పలుచోట్ల మొక్కలు నాటిన అధికారులు

మార్కాపురం, జూన్‌ 5: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మార్కాపురం డీఎ్‌ఫవో బబిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక డీఎ్‌ఫవో కార్యాలయంలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపెకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కను నాటడంతోపాటు దానిని పెంచి పెద్దది చేయాలన్నారు.  కార్యక్రమంలో అటవీ క్షేత్ర అధికారి వి.భాస్కర్‌రెడ్డి, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ బి.వి.నరసయ్య, కామేశ్వరరావు పాల్గొన్నారు. 

పుల్లలచెరువులో..

పుల్లలచెరువ : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  నరజాముల గ్రామ పంచాయతీ  సర్పంచి  బాలునాయక్‌ అన్నారు. ప్రపంచ పర్యావారణ దినోత్సవం సందర్భంగా నరజాములతాండా సచివాలయం ఆవరణలో ఐటీసీ, ఎస్‌ఎ్‌సజీఎస్‌ సంస్థ ఆధ్వర్యం లో శనివారం మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలుగుతామని సర్పంచ్‌ అన్నారు.  కార్యక్రమంలో ఐటీసీ సంస్ధ ప్రతి నిధులు గోపాలనాయక్‌, సచివాలయ సిబ్బంది బార్గవ్‌, హనుమంతరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల : జీవకోటి మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యతని డిప్యూటీ డీఎఫ్‌వో వినీత్‌కుమార్‌ అన్నారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో రేంజి అధికారి కే.సునీల్‌ కుమార్‌ అధ్యక్షతన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరయిన డీప్యూటీ డీఎఫ్‌వో వినీత్‌ కుమార్‌ దంపతులు కా ర్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలోని  అటవీ సమీప గ్రామాలు చట్టుతాండా, చింతల, తుమ్మలబైలు గిరిజనులతో నల్లమల అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణ వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు, అదేవిధంగా చెట్లను నరకడం, వ్యర్థపదార్థాలు, ప్లాస్టిక్‌ వస్తువులు వేయడం, అడవికి నిప్పు పెట్టడం వలన కలిగే అనర్థాలను వివరించారు. అటవీ శాఖాధికారులు, గిరిజనుల సహకారంతోనే నల్లమలను కాపాడుకోగలమన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వార్థపరులు కొందరు అటవీ సంపదకు, వన్యప్రాణులకు విఘా తం కల్గిస్తున్నారని తద్వారా కలిగే నష్టాలు లెక్కకట్టలేమని, పర్యావరణ సమతుల్యం లోపించడం వల్ల కరోనా వంటి భయంకరమైన విషతుల్యమైన వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, చివరికి సహజంగా లభించే ఆక్సిజన్‌ కూడా కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ముందు తరాల వారికి మనం అందించే పెద్ద సంపద వృక్ష సంపదేనని ప్రతి ఒక్కరూ తమ వంతు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనిపిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌వో ప్రసాదరెడ్డి, ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-06T06:55:06+05:30 IST