ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-05-08T07:35:27+05:30 IST

మండలంలోని బసిరెడ్డిపాలెం, గుడ్లూరులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కందుకూరు వ్యవసాయ శాఖ ఏడీఏ శేషగిరి శుక్రవారం సందర్శించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఏడీఏ శేషగిరి

 గుడ్లూరు, మే 7 : మండలంలోని బసిరెడ్డిపాలెం, గుడ్లూరులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కందుకూరు వ్యవసాయ శాఖ ఏడీఏ శేషగిరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ బసిరెడ్డిపాలెం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 173 మంది రైతులకు సంబంధించి 9,971 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇంకా సుమారు ఐదు వేల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు ఏడీఏ చెప్పుకొచ్చారు. లారీలు సకాలంలో రాకపోవడం మూలానే కొనుగోళ్లు సాగడం లేదని కేంద్రం ఇన్‌చార్జి అనురాధ ఏడీఏకు వివరించారు. అలాగే గుడ్లూరు కేంద్రం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి గీతాప్రకాష్‌తో పాటు వెలుగు, సొసైటి సిబ్బంది పాల్గొన్నారు. Updated Date - 2021-05-08T07:35:27+05:30 IST