ఆటో, బైక్‌ ఢీకొని ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:00:07+05:30 IST

ఆటో, మోటార్‌సైకిల్‌ ఢీకొని ఒకరు మృతి చెందారు.

ఆటో, బైక్‌ ఢీకొని ఒకరు మృతి
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై కోటయ్య

మార్కాపురం, నవంబరు 28: ఆటో, మోటార్‌సైకిల్‌ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని రాయవరం వద్ద చోటుచేసుకొంది. రూరల్‌ ఎస్‌ఐ జి.కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం వద్ద మార్కాపురం నుంచి కలుజువ్వలపాడు వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో మార్కాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ అక్కడికక్క డే మృతి చెందాడు. మోటార్‌ సైకిలిస్ట్‌, ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వ ల్పగాయాలు కావడంతో 108 వాహనంలో మార్కాపురం వైద్యశాలకు తర లించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.  


Updated Date - 2021-11-29T05:00:07+05:30 IST