పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-06T06:17:41+05:30 IST

పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సర్విరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది.

పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
అంకయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్సై గోపాలకృష్ణ

కొమరోలు, ఫిబ్రవరి 5 : పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సర్విరెడ్డిపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల మేరకు... మండలంలోని కొత్తపల్లెకు చెందిన మారె అంకయ్య(70) వారం క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కుటుం బ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆ వృద్ధుడు సర్విరెడ్డిపల్లె సమీపంలో భైరవేశ్వర ఆలయం వద్ద పురుగుమందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ గోపాలకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-02-06T06:17:41+05:30 IST