ఎన్‌టీఆర్‌ విగ్రహం ధ్వంసానికి యత్నం

ABN , First Publish Date - 2021-05-19T05:13:28+05:30 IST

: మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకు డు దివంగత ఎన్టీఆర్‌ విగ్ర హంపై రాళ్ల దాడి చేసి ధ్వంసానికి యత్నించారు. ఈ ఘటన మండలంలోని కరే డు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.

ఎన్‌టీఆర్‌ విగ్రహం ధ్వంసానికి యత్నం
రాళ్ల దాడిలో పెచ్చులు లేచిన ఎన్‌టీఆర్‌ విగ్రహం

కరేడు(ఉలవపాడు), మే 18 : మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకు డు దివంగత ఎన్టీఆర్‌ విగ్ర హంపై రాళ్ల దాడి చేసి ధ్వంసానికి యత్నించారు. ఈ ఘటన మండలంలోని కరే డు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామ టీడీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రా మానికి చెందిన ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మద్యం తాగి రాళ్లతో విగ్రహంపై దాడి చేశారు. ఆ ఘటనను గమనించిన గ్రామ పెద్దలు కొందరు వారిని వారించారు. దీంతో వారు పలాయనం చిత్త గించారు. నాలుగు రోడ్ల కూడలిలో నిలువెత్తు ఎన్‌టీఆ ర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందు కు ముందుగా చిన్నపాటి విగ్రహా న్ని నెలకొల్పారు. ఆ కూడలిలో గతంలో ఏళ్ల నాటి వేపచెట్టు కూడేది. దాని కింద దిమ్మెను ఏర్పా టుచేసి విగ్రహాన్ని పెట్టారు. మూడు నెలల క్రితం ఆ వేప చెట్టును తొలిగించారు. అక్కడ ఎన్‌టీఆర్‌ విగ్రహం మాత్రమే ఉంది. దీన్నీ తొలిగించే ప్రయత్నాలలో భాగంగా కొందరు వైసీపీ ఆకతాయి కార్యకర్తలు ఈ చర్యలకు పూనుకుంటున్నా రని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


Updated Date - 2021-05-19T05:13:28+05:30 IST