ఘనంగా జూ.ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం

ABN , First Publish Date - 2021-05-21T05:07:48+05:30 IST

మండలంలోని యడవల్లి, ఎగో చెర్లోపల్లి గ్రామాలలో గురువారం జూనియర్‌ ఎన్‌టీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘ నంగా నిర్వహించారు.

ఘనంగా జూ.ఎన్టీఆర్‌ జన్మదినోత్సవం

పెద్ద దోర్నాల, మే 20: మండలంలోని యడవల్లి, ఎగో చెర్లోపల్లి గ్రామాలలో గురువారం జూనియర్‌ ఎన్‌టీఆర్‌ పుట్టినరోజు వేడుకలు  ఘ నంగా నిర్వహించారు. యడవల్లిలో యేర్వ మల్లికార్జునరెడ్డి, ఎగో చెర్లోపల్లిలో గుంటక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కేకును కట్‌చేసి అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టా రు. మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కొండా రామయ్య, తెల్లమేకల శ్రీనివాసులు, శ్రీను,  ప్రసాద్‌ పాల్గొన్నారు.

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకలను మండలంలోని పలు గ్రామాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్‌లు కట్‌చేసి పంచి పెట్టారు. 


Updated Date - 2021-05-21T05:07:48+05:30 IST