సర్పంచ్‌లు సుపరిపాలన అందించాలి

ABN , First Publish Date - 2021-02-26T05:50:41+05:30 IST

కొత్తగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్‌లు సుపరిపాలన అందించాలని శాసనసభ్యులు ఏలూరి సా ంబశివరావు కోరారు.

సర్పంచ్‌లు సుపరిపాలన అందించాలి
వలపర్లలో నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 


చినగంజాం, ఫిబ్రవరి 25 : కొత్తగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్‌లు సుపరిపాలన అందించాలని శాసనసభ్యులు ఏలూరి సా ంబశివరావు కోరారు. చినగంజాం గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పం చ్‌, వార్డు సభ్యుల ఆత్మీయ సమావేశం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు, ఉపసర్పంచ్‌ చెరుకూరి రాఘవయ్యలను ఏలూరి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి టీ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పర్వతరెడ్డి సత్యనారాయ ణ, టి.జయరావు, బెల్లంకొండ రమేష్‌బాబు, సందు శ్రీనివాసరావు, బి.సామ్యేల్‌, నరహరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

మార్టూరు : వలపర్ల సర్పంచ్‌గా గెలుపొందిన తాళ్లూరి బ్రహ్మయ్యను, విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకుల ను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. స ర్పంచ్‌ బ్రహ్మయ్యతో పాటు, నాయకులు కంభంపాటి హనుమంతరావు, గుంటి వెంకటేశ్వర్లు, షేక్‌ బషీర్‌, బూరగ వీరయ్య అభినందించారు. కోనంకిలో అనారోగ్యానికి గురైన ఉప్పలపాటి కృపారావు, రాములను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన తాళ్లూరి కోటేశ్వరరావు, గొర్రెపాటి సిం గయ్యల కుటుంబసభ్యులతో మాట్లాడారు. మార్టూరులో  గాయపడిన పోపూరి శ్రీనివాసరావు చికిత్స వివరాలు తెలుసుకున్నారు.  బొబ్బేపల్లిలో దండా శ్రీనివాసరావు సతీమణి ఇటీవల మృతి చెందటంతో వారిని ఏలూరి పరామర్శించా రు. ఆయన వెంట కోటపాటి సురేష్‌ ఉన్నారు.


Updated Date - 2021-02-26T05:50:41+05:30 IST