బీసీ కార్పొరేషన్‌కు నూతన భవనం
ABN , First Publish Date - 2021-09-03T06:06:05+05:30 IST
జిల్లా బీసీ కార్పొరేషన్‌కు త్వరలో సొంత గూడు ఒనగూరనుంది. నూతన భవనాన్ని రూ.50 లక్షలతో నిర్మించేందుకు అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

రూ.50లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఒంగోలు నగరం, సెప్టెంబరు 2: జిల్లా బీసీ కార్పొరేషన్‌కు త్వరలో సొంత గూడు ఒనగూరనుంది. నూతన భవనాన్ని రూ.50 లక్షలతో నిర్మించేందుకు అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ కా ర్యాలయం ఒంగోలులోని దక్షిణ బైపాస్‌లో ఉన్న ప్రగతిభవన్‌లో కింది భాగంలో నిర్వహి స్తున్నారు. ప్రగతిభవన్ వెనుక భాగం శిథిలావస్థకు చేరింది. ప్రమాదభరితంగా ఉన్న ఈ భవనంలోనే బీసీ కార్పొరేషన్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో బీసీ కా ర్పొరేషన్ పరిధిలోని పలు కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌లను ఏర్పాటు చే సింది. దీంతో ఆయా కార్పొరేషన్ల కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా తగిన సిబ్బంది ని నియమించాల్సి ఉంది. అంతేగాకుండా బీసీకార్పొరేషన్ కార్యాలయానికి విశాలమైన భవ నం కూడా అవసరం. దీంతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రగతిభవన్ ఆవరణలోనే ప్రయివేట్ క్యాంటీన్‌కు ద క్షిణం వైపున కార్యాలయాన్ని నిర్మించేందుకు స్థలాన్ని ప్రతిపాదించారు.