ఏరియా హాస్పిటల్‌లో నూతన బెడ్‌లు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-05T06:42:33+05:30 IST

కందుకూరు ఏరియా హాస్పిటల్‌లో దాతలు అందించిన 30 నూతన బెడ్‌లను ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఏరియా హాస్పిటల్‌లో నూతన బెడ్‌లు ఏర్పాటు
ఏరియా హాస్పిటల్‌లో దాతల సాయంతో నూతన బెడ్‌లు ఏర్పాటు

ఏరియా హాస్పిటల్‌లో దాతల సాయంతో నూతన బెడ్‌లు ఏర్పాటు 

కందుకూరు, మే 4 : కందుకూరు ఏరియా హాస్పిటల్‌లో దాతలు అందించిన 30 నూతన బెడ్‌లను ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మహీధర రెడ్డి విజ్ఞప్తితో అమరావతి హాస్పటల్స్‌ నిర్వాహకులు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 17 బెడ్‌లు, రావినూతలకు చెందిన కంచర్ల శ్రీకృష్ణ 10 బెడ్‌లు అందజేశారు. అధునాతన సౌకర్యాలతో ఒక్కో బెడ్‌ రూ.25వేలు విలువజేసేవి కావటంతో తల్లీబిడ్డల సంరక్షణ  కోసం వీటిని వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డాక్టరు ఇంద్రాణి పాల్గొన్నారు.


Updated Date - 2021-05-05T06:42:33+05:30 IST