నేతపాలెం.. సమస్యల చింత

ABN , First Publish Date - 2021-08-21T05:24:16+05:30 IST

వారంతా రెక్కాడితేకాని డొక్కాడని పేదలు

నేతపాలెం.. సమస్యల చింత
ఇళ్లు ముందు ఉన్న నీళ్ల డ్రమ్ములు

నగర పంచాయతీలో ఉన్నా వసతులు కరువు

నీటి వసతిలేక తీవ్ర ఇబ్బందులు

ట్యాంకర్లపైనే ఆధారం

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

పొదిలి, ఆగస్టు 20: వారంతా రెక్కాడితేకాని డొక్కాడని పేదలు. ఒకవైపు పనులకోసం పరుగులు పడుతూ.. మరోవైపు కాలనీల్లో అసౌకర్యాలతో పడరాని పాట్లు పడుతున్నారు.  నివాసప్రాంతంలో సమస్యలతో సహవాసం చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

 పొదిలి నగరపంచాయతీ పరిధిలోని నేతపాలెంలో సమస్యలు ముసురుకున్నాయి.  ఇక్కడ 300 కుటుం బాలు నివాసం ఉంటున్నాయి. ఎక్కువ శాతం మం దికి ఏరోజు పని దొరికితేనే ఆరోజు నాలుగు వేళ్లు నోటి లోకి వెళ్లేది. వీరికి నిత్యం ఏదొక సమస్య వేధిస్తోంది. ప్రధానంగా నీటి కోసం వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటిపైనే వారు ఆధారపడాల్సిన దుస్థితి నెల కొంది. వాడుకనీరు కూడా సరిపోయినన్ని రాకపోవ డంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బోర్లు కూడా పనిచేయకపోవడంతో ట్యాంకర్ల నీటికోసమే ఆధార పడాల్సిన పరిస్థితి. ఇక తాగునీటి కో సం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. నామమాత్రంగా మూడు, నాలుగు రోజుల కొకసారి వచ్చే సాగ ర్‌నీరు కొన్ని కుటుంబాలకు మాత్ర మే అందుతోంది. మిగిలిన కుటుంబా లు మంచినీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీం తో కొంతమంది గత్యంతరం లేక స్థోమతలేకపోయిన బబుల్‌నీరు కొనుగోలుచేసి గొంతు తడుపుకుం టున్నారు.

నేతపాలెంలో పారిశుధ్య సమస్య నెలకొంది.  మురుగునీరు పోయే దారిలేదు. దీంతో ఎక్కడికక్కడ మురుగు పేరుకుపోతోంది. దీంతో వీరు జ్వరాలబారిన పడుఉన్నారు. చర్చి సమీపంలోని విద్యుత్‌ స్తంభం శిథిలావస్థకు చేరింది. దీంతో ఏప్రమాదం ముంచుకొ స్తుందోనని భయపడుతున్నారు. ఎన్నిసార్లు అధి కారులకి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. చర్చి ఏరియాలో నాలుగు నెలలుగా వీధి లైట్లు పనిచేయక అంధకారం నెలకొంది. చీకటి పడితే బయటకు పోయేందుకు జంకుతున్నామన్నారు. 

నేతపాలెం వాసులకు చిన్న చెరువు ఆయకట్టు కిం ద పది సెంట్ల చొప్పున రెండు చోట్ల శ్మశానవాటికలు ఉన్నాయి. అయితే, అక్కడికి వెళ్లేందుకు సరైన దారిలే దు. వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే మోకాలిలోతు నీళ్ళలోంచి మృతదేహాన్ని మోసుకెళ్ళాల్సిన దుస్థితి నెల కొంది. పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరి ష్కరించాలని నేతపాలెం వాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-21T05:24:16+05:30 IST