సారా ఊట ధ్వంసం
ABN , First Publish Date - 2021-02-14T06:02:02+05:30 IST
నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న నాటు సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఎస్‌ఈబీ అధికారులు వేగవంతం చేశారు. నామినేషన్ల సందర్భంగా సారా ప్రభావం బాగా కనిపించినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పటికే సారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న ఎస్‌ఈబీ అధికారులు దాడులు పెంచారు.
గిద్దలూరు, ఫిబ్రవరి 13 : నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న నాటు సారా బట్టీలను గుర్తించి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఎస్‌ఈబీ అధికారులు వేగవంతం చేశారు. నామినేషన్ల సందర్భంగా సారా ప్రభావం బాగా కనిపించినట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అప్పటికే సారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న ఎస్‌ఈబీ అధికారులు దాడులు పెంచారు. బేస్తవారపేట మండలం జేబీక్రిష్టాపురం సమీప కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సారా బట్టీని, డమ్ములను తగులబెట్టారు. గిద్దలూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సారా బట్టీల ఆచూకీ తెలిపి సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల 23 కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి, 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సోమయ్య తెలిపారు. 17 సారా బట్టీలను ధ్వంసం చేసి 17,500 లీటర్ల ఊటను పారబోసినట్లు చెప్పారు. బెల్టుషాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.