వచ్చేనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-11-26T05:33:29+05:30 IST

జిల్లాలోని అన్ని కోర్టుల్లో వచ్చేనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.వెంకట జ్యోతిర్మయి తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, వివాహ సంబంధ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో కక్షిదారులు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా న్యాయవాదుల సమక్షంలో కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

వచ్చేనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌
మాట్లాడుతున్న జడ్జి వెంకట జ్యోతిర్మయి

జిల్లా జడ్జి వెంకట జ్యోతిర్మయి

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 25 : జిల్లాలోని అన్ని కోర్టుల్లో వచ్చేనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.వెంకట జ్యోతిర్మయి తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, వివాహ సంబంధ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటారు వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో కక్షిదారులు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా న్యాయవాదుల సమక్షంలో కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రఽధానంగా చెక్కులకు సంబంధించి ఏడు లక్షల వరకు గల కేసుల్లో ఇరువర్గాలను పిలిపించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పొందిన రుణాలకు సంబంధించి ఆయా ఆర్థిక సంస్థలు, బ్యాంకు అధికారులతో మాట్లాడి కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలోని కక్షిదారులందరూ జాతీయ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని జ్యోతిర్మయి కోరారు. 


Updated Date - 2021-11-26T05:33:29+05:30 IST