ఉమ్మడివరంలో ఆరు నాణేలు స్వాధీనం
ABN , First Publish Date - 2021-06-09T05:15:26+05:30 IST
మండలం ఉమ్మడివరం గ్రా మంలోని మస్సమ్మ గుడిలో బయటపడిన నాణేల్లో ఆ రిం టిని అధికారులు మంగళ వా రం స్వాధీనం చేసుకున్నా రు.
పుల్లలచెరువు, జూన్ 8 : మండలం ఉమ్మడివరం గ్రా మంలోని మస్సమ్మ గుడిలో బయటపడిన నాణేల్లో ఆ రిం టిని అధికారులు మంగళ వా రం స్వాధీనం చేసుకున్నా రు. ప్రజలు స్వచ్ఛందంగా అప్ప గిస్తే బహుమతులు అంద జేస్తామని ప్రకటించారు. ‘మస్సమ్మ గుడిలో నాణేలు’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. తహసీల్దార్ సిహెచ్.అశోక్‌రెడ్డి, ఎస్సై వి.సుధాకర్ గ్రా మానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కొం దరు తాము దొరికిన ఆరు నాణే లను వారికి ఇవ్వగా స్వాధీనం చేసు కున్నారు. వీటిని జిల్లా ఖజానా కా ర్యాలయానికి తరలిస్తామని తహసీ ల్దార్ తెలిపారు. గ్రామంలో ఎక్కువ సంఖ్యలో నాణేలు దొరికాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ నాణేలు దొరికిన వారు స్వచ్ఛందంగా వాటిని తీసుకువచ్చి ఇస్తే బహు మతులు అందజేస్తామని చెప్పారు.