నేటి నుంచి నాసరయ్య ఉరుసు మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-24T05:22:55+05:30 IST

త్రిపురాంతకంలోని నాసరయ్య పెద్ద మఠంలో ఈనెల 24 నుంచి 26 వరకు ఉరుసు మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు.

నేటి నుంచి నాసరయ్య   ఉరుసు మహోత్సవాలు


త్రిపురాంతకం, నవంబరు 23 : త్రిపురాంతకంలోని నాసరయ్య పెద్ద మఠంలో ఈనెల 24 నుంచి 26 వరకు ఉరుసు మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. 24న ఉదయం ఉరుసుగంధం, ఊరేగింపు, 25న కనుమ, 26న గురుపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా 24వ తేదీ రాత్రి పౌరాణిక, జానపద నాటకాలు ప్రదర్శిస్తారన్నారు. ఉరుసు మహోత్సవాలకు  వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడతామని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా మఠానికి నూతనంగా రంగులు వేసి ఉత్సవాలకు సిద్ధం చేశారు. 

Updated Date - 2021-11-24T05:22:55+05:30 IST