ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ ఉండాలి
ABN , First Publish Date - 2021-05-08T07:33:28+05:30 IST
కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు హాస్పటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేయకుండా, బాధితులకు మెరుగ్గా వైద్యసేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కోరారు.

కందుకూరు, మే 7: కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు హాస్పటల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేయకుండా, బాధితులకు మెరుగ్గా వైద్యసేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు హాస్పటల్స్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, తక్షణం పరిస్థితిని చక్కదిద్దుకుని వారు మెరుగైన సేవలు అందించేలా టాస్క్‌ఫోర్స్ కమిటీ పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంపై జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారితో మాట్లాడిన ఎమ్మెల్యే తక్షణం పరిస్థితిని చక్కదిద్దాలని, తగినన్ని మందులు సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. శనివారం నుంచి మందుల దుకాణాలు, పాల బూత్‌లకు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉన్నందున వీధులలో ఏ ఒక్కరు కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్ డి.సీతారామయ్యతో పాటు సీఐ విజయకుమార్, డాక్టరు ఇంద్రాణి, ఎంపీడీవో విజయశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, ఎస్‌ఐలు తిరుపతిరావు, కె. అంకమ్మ, ఏడీఏ ఎం. శేషగిరి తదితరులు పాల్గొన్నారు.