ముస్లింల సహకారాన్ని మరువలేను
ABN , First Publish Date - 2021-02-06T06:58:05+05:30 IST
తనకు ఎల్లవేళల అండగా ఉంటూ, ఆదరిస్తున్న ముస్లీంలను తానెప్పుడూ మరిచిపోలేనని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.

కనిగిరి, ఫిబ్రవరి 5: తనకు ఎల్లవేళల అండగా ఉంటూ, ఆదరిస్తున్న ముస్లీంలను తానెప్పుడూ మరిచిపోలేనని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఉదయాన్నే 19వ వార్డులో ‘చాయ్’ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ వారి నివాసాల్లో టీని కలిపి వారికి అందించారు. ఆ సమయంలో వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నీటి సమస్య ఉందని తమ వార్డుల్లో బోరు వేస్తే కొంత మేర ఇబ్బంది తప్పుతుందని ఉగ్ర ఎదుట మహిళలు వాపోయారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని మార్పించే దిశగా అధికారులు చొరవ చూపించేలా చూడాలని కోరారు. బీబీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆమెకు ఉగ్ర ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా నబీ సాహెబ్‌ను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ షేక్ వాజిదా అహ్మద్ కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్, గండికోట రమేష్, నజీముద్దీన్, నరసింహా, ఫిరోజ్, బేరి పుల్లారెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, కొండలు, షేక్ పీర్ల బారా ఇమాం, రిజ్వాన్, ఖాసీం, ఆసీఫ్, కాలేషా, సలీం, ఖాసీం పీరా, మస్తాన్, బీబీ జాన్, జిలానీ, సందాని తదితరులు పాల్గొన్నారు.
పీసీపల్లి : కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతు వేమూరి లక్ష్మయ్య గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి ఆదుకునేందుకు ఉగ్ర ఆర్థిక సాయం చేశారు. టీడీపీ మండల నేత మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గడ్డం బాలసుబ్బయ్య, నాయకులు వేమూరి రామయ్య, కొండయ్య, సుబ్బారావు, గ్రామస్థులు ఉన్నారు.
పామూరు : పంచాయితీ పరిధిలోని 14వ వార్డుకు చెందిన పలువురు ముస్లీంలు వైసీపీని వీడి కనిగిరిలోకి ఉగ్ర క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ కండువాలతో ఆహ్వానించారు. వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన వారిలో షేక్ మస్తాన్‌వలి, ఖాజా రసూల్, షేక్ మహబూబ్ బాషా, షేక్ మస్తాన్‌వలి, ఆర్ నాయబ్ రసూల్, ఆర్ హాజీమలాన్, షేక్ చిన్న కరిముల్లా, షేక్ రసూల్, ఎండీ రఫీ తదితరులు పత్తు మస్తాన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరినట్లు తెలిపారు.