మున్నాగ్యాంగ్‌పై నేర నిరూపణ

ABN , First Publish Date - 2021-05-19T05:09:46+05:30 IST

హైవే కిల్లర్‌గా ముద్రపడ్డ మున్నా బాయ్‌గ్యాంగ్‌పై 2008లో నమోదైన నాలుగు కేసులలో నేరం నిరూపణ అయింది. మంగళవారం న్యాయమూర్తి 18 మంది నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు.

మున్నాగ్యాంగ్‌పై నేర నిరూపణ

18 మందికి జ్యుడిషియల్‌ కస్టడీ

ఒంగోలు(క్రైం), మే 18 : హైవే కిల్లర్‌గా ముద్రపడ్డ మున్నా బాయ్‌గ్యాంగ్‌పై 2008లో నమోదైన నాలుగు కేసులలో నేరం నిరూపణ అయింది. మంగళవారం న్యాయమూర్తి 18 మంది నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు. మద్దిపాడులో 2 కేసులు, సింగరాయకొండ ఒక కేసు సీఐడీ విచారిస్తున్న మరో కేసులో వారిని నేరస్థులుగా గుర్తించారు. ఈనెల 20వ తేదీన శిక్షలు విధిస్తామని వారు పేర్కొన్నారు. అప్పటికే కొందరు రిమాండ్‌లో ఉండగా, మరికొంత మంది బెయిల్‌పై ఉన్నారు.

Updated Date - 2021-05-19T05:09:46+05:30 IST