మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-09-04T05:12:52+05:30 IST

తాళం వేసిన మోటార్‌సైకిళ్లను చోరీ చేసి జల్సా లు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి, 21 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

మోటార్‌సైకిళ్ల దొంగ అరెస్టు
స్వాధీనం చేసుకున్న మోటార్‌సైకిళ్లను పరిశీలిస్తున్న ఎస్పీ మలిక గర్గ్‌

21 వాహనాల రికవరీ

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్‌

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 3: తాళం వేసిన మోటార్‌సైకిళ్లను చోరీ చేసి జల్సా లు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి, 21 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మోటా ర్‌సైకిళ్లను దొంగతనాలు చేస్తూ  తప్పిం చుకుని తిరుగుతున్న దొంగను ఎట్టకేలకు ఒంగోలు తాలుకా పోలీసులు పట్టుకున్నా రు. ఈమేరకు శుక్రవారం స్థానిక పోలీస్‌ కార్యాలయం ఆవరణంలోని గెలాక్సీ సమా వేశం మందిరంలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.  

జిల్లాలోని కంభం పట్టణానికి చెందిన దూదేకుల ఖలీల్‌ అలియాస్‌ గున్ను మో టార్‌సైకిళ్లను చోరీ చేయడం వృత్తిగా ఎం చుకున్నాడు. ఈ ఏడాది మే నుంచి ఇప్ప టివరకు ఒంగోలు తాలుకా పరిధిలో 7, గుంటూరు జిల్లా కొత్తపేట పరిధిలో 7, ఒంగోలు వన్‌టౌన్‌లో 1, గంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో 2, నగరంపాలెం ప రిధిలో 1, కృష్ణలంకలో 1, మార్కాపురం పరిధిలో 1 మోటర్‌సైకిల్‌ను అపహరించి నట్లు ఎస్పీ తెలిపారు. అంతేగాకుండా రా ష్ట్రంలోని నంద్యాల, కర్నూలు, అనంతపు రం, గిద్దలూరు, నరసరావుపేట, విజయ వాడతో పాటు తెలంగాణలోని మహబూ బ్‌నగర్‌ జిల్లాలో కూడా ఖలీల్‌పై కేసులు ఉన్నాయని చెప్పారు. ఇంకా చాలా కేసు లు కోర్టుల్లో విచారణలో ఉన్నా యన్నారు. 

శుక్రవారం ఉదయం ఒంగోలు నగరం లోని ఉత్తర బైపాస్‌ రోడ్డులో తాలుకా పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుం డగా అనుమానంగా తిరుగుతున్న ఖలీల్‌ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పా రు. 21 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసు కున్నట్టు చెప్పారు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 

కాగా వరుసగా మోటార్‌సైకిళ్లు చోరీలు జరుగుతున్న సమయంలో నిందితుడిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ ప్రసాద్‌, తాలుకా ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఐ దేవకుమార్‌, సిబ్బంది కె.సు రేష్‌, కె.రామకృష్ణ, వి.శ్రీనివాసులు, కె.రవి కుమార్‌ లను ఎస్పీ మలికగర్గ్‌ అభి నందించారు.

Updated Date - 2021-09-04T05:12:52+05:30 IST