దోమల దండయాత్ర

ABN , First Publish Date - 2021-09-04T05:19:53+05:30 IST

సింగరాయకొండ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో విపరీతంగా దోమల బెడద పెరిగింది.

దోమల దండయాత్ర

ఇటీవలి వర్షాలకు గ్రామాల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన మురుగు

దోమలకు ఆవాసాలుగా వీధులు

తోడైన అప్రకటిత కరెంట్‌ కోతలు

వాటి దాడులతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు


సింగరాయకొండ, సెప్టెంబరు 3 : మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో విపరీతంగా దోమల బెడద పెరిగింది. వీటి దాడుల దెబ్బకు ప్రజల కంటి మీద కునుకు కూడా కరువైంది. వర్షాకాలానికి తోడు అప్రకటిత కరెంటు కోతలు కూడా తోడవడంతో ప్రజలు దోమలు బెడదకు బెంబేలెత్తిపోతున్నారు. మండలంలో నిన్నమొన్నటి వరకు కొవిడ్‌ ఉధృతి అధికంగా ఉంది. ఆ కేసుల దృష్ట్యా ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు అవులవుతూనే ఉన్నా యి. ఈ దుస్థితిలోనే దోమలు విజృంభిస్తుండడం వారిని మరింత ఇక్కట్ల పాల్జేస్తోంది. చాలా గ్రామాల్లో సై డు కాలువలు లేని వీధుల్లో మురుగు రోడ్లపైకి ఎక్కి తాం డవం చేస్తోంది. మురుగు బయటకుపోయే అవకాశం లేక జనావాసాల మధ్యే నిల్వ చేరి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మురుగులో దోమలు ఉ త్పత్తి చెంది అవి ప్రజలపైకి దండయాత్ర చేస్తున్నాయి.

మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు జ్వరపీడితులు, జలుబు, దగ్గుతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉం టుంది. చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడా డెంగ్యూ కేసులూ నమోదవుతున్నాయి. ప్రధాన ప్రైవేట్‌ ఆసుపత్రులతోపాటు ప్రాఽథమి క ఆకోగ్యకేంద్రంలో కూడా రోగుల సంఖ్య భారీస్థాయిలో ఉంది. జూ లైౖలో పీహెచ్‌సీలో ఓపీ సంఖ్య 1670 ఉండగా ఆగస్టులో ఓపీ 3434 పెరిగింది. ఈ పెరుగుల మండలంలో రోగాల ఉధృతికి అద్దంపడుతోంది.


శానిటైజేషన్‌ను మరిచిన అధికారులు

సీజనల్‌ వ్యాధులు వ్యాప్తితోపాటు కొవిడ్‌ కేసులు నమో దు అవుతున్న తరుణంలో అధికారులు కనీసం శానిటైజేషన్‌పై దృ ష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. మండలంలో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామాల్లో బ్లీచింగ్‌, ఫాగిం గ్‌ చర్యలు చేపట్టడం లేదు. కొవిడ్‌ మొదటిదశలో కొన్ని గ్రామాల్లో అదీ నామమాత్రంగా ఫాగింగ్‌ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో బ్లీచింగ్‌ గాని ఫాగింగ్‌ చేసిన దాఖలాలు లేవు. దీంతో రోగాల పాలవుతున్నామని ప్రజలు వాపోతోన్నారు. గ్రామాల్లో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టి రోగాల బారినపడకుండా  కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-09-04T05:19:53+05:30 IST