మోహినీ అలంకరణలో చెన్నకేశవుడు

ABN , First Publish Date - 2021-05-05T05:58:32+05:30 IST

మార్కాపురం పట్టణంలో వెలసిఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరు గు తున్నాయి.

మోహినీ అలంకరణలో చెన్నకేశవుడు


మార్కాపురం (వన్‌టౌన్‌) మే 4 : మార్కాపురం పట్టణంలో వెలసిఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరు గు తున్నాయి. మంగళవారం రాత్రి చెన్నకేశవస్వామి మూలవిరాట్‌కు మో హినీ అలంకరణ నిర్వహించారు. అర్చకులు శ్రీపతి అప్పనచారులు శ్రీ చం దనంతో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు.

గజవాహనంపై  కొలువైన స్వామి

బ్రహ్మోత్సవాలలో భాగంగా చెన్నకేశవస్వామి గజ వాహనంపై సౌర్వ భౌమ అలంకారణలో మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తిని అర్చకులు అప్పనా చార్యులు ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.


Updated Date - 2021-05-05T05:58:32+05:30 IST