ఎమ్మెల్సీగా తూమాటి ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-27T04:56:13+05:30 IST

జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైసీపీకి చెందిన తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ వెంకట మురళీ శుక్రవారం సాయంత్రం డిక్లరేషన్‌ను అందజేశారు.

ఎమ్మెల్సీగా తూమాటి ఏకగ్రీవం
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటమురళీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు డిక్లరేషన్‌ను అందుకుంటున్నతూమాటి మాధవరావు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 26: జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైసీపీకి చెందిన తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ వెంకట మురళీ శుక్రవారం సాయంత్రం డిక్లరేషన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాధవరావును పలువురు అభినందించారు.  కార్యక్రమంలో వైసీపీ అద్దంకి ఇన్‌చార్జీ బాచిన కృష్ణచైతన్య, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు కఠారి శంకర్‌ తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-11-27T04:56:13+05:30 IST