ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-11-21T05:55:57+05:30 IST

జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అ ధికారి, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి ఆదేశించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

జేసీవెంకటమురళి


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20 : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అ ధికారి, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటమురళి ఆదేశించారు. శనివారం ఒంగోలులో పో లింగ్‌ బూత్‌లు, కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలను ఆయన పరిశీలించారు.  వ చ్చే నెల 10న ఎన్నికలు, 14వ తేదీన ఓట్లలెక్కింపు జరుగుతుందని ఆయన చెప్పా రు. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఓటర్ల కోసం ఒంగోలులోని ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్‌ బాక్సు లను  నూత నంగా నిర్మించి న బధిరుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలిస్తామన్నా రు. అనంతరం సంతపేటలో  ఓటర్ల జాబితా సవరణను పరి శీలించారు.


Updated Date - 2021-11-21T05:55:57+05:30 IST