జొన్నతాళి వద్ద రోడ్డుపై ఎమ్మెల్యే గొట్టిపాటి బైఠాయింపు
ABN , First Publish Date - 2021-10-21T06:06:33+05:30 IST
మండల పరిధిలోని జొన్నతాళి సెంటరు వద్ద జాతీయరహదారిపై బుధవారం మఽ ద్యాహ్నం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 15 నిమిషాలపాటు పోలీసులకు, కార్యకర్తలకు వాదన జరిగింది.

చిలకలూరిపేట నుంచి వస్తుండగా అడ్డుకున్న అద్దంకి సీఐ
వైసీపీ ర్యాలీకి ఎలా అనుమతిచ్చారని నిలదీసిన రవికుమార్
మార్టూరు, అక్టోబరు 20 : మండల పరిధిలోని జొన్నతాళి సెంటరు వద్ద జాతీయరహదారిపై బుధవారం మఽ ద్యాహ్నం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 15 నిమిషాలపాటు పోలీసులకు, కార్యకర్తలకు వాదన జరిగింది. బుధవారం టీడీపీ రాష్ట్రవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా రవికుమార్ ఉదయాన్నే చిలకలూరిపేట నుంచి అద్దంకి బయలు దేరా రు. జొన్నతాళి సెంటరు వద్ద రవికుమార్ వాహనాలను అద్దంకి సీఐ రాజేష్ ఆధ్వర్యంలో కొరిశపాడు ఎస్‌ఐ ఖాదర్‌బాషా, మార్టూరు ఎస్‌ఐ చౌడయ్యలతో కూడిన పోలీసు ల బృందం అడ్డగించారు. అనంతరం రవికుమార్‌ను అ రెస్ట్ చేసి సమీపంలో అతని గ్రానైట్ పరిశ్రమకు తరలించారు. విషయం తెలుసుకున్న అద్దంకి నియోజకవర్గ టీ డీపీ నాయకులు, కార్యకర్తలు గ్రానైట్ పరిశ్రమ వద్దకు భా రీగా తరలివచ్చారు. ఇదిలా ఉండగానే అద్దంకిలో వైసీపీ నేతల ర్యాలీ ప్రారంభమైందన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రవికుమార్‌కు ఈ విషయాన్ని తెలియచేశారు. దాంతో ఎమ్మెల్యే రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా, వైసీపీ వారి ర్యాలీకి ఎం దుకు అనుమతి ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేస్తూ జా తీయ రహదారిపై బైఠాయించేందుకు గ్రానైట్ పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు. పోలీసులు అడ్డుకుంటున్నా రవికుమార్ తప్పించుకుని వచ్చి బైఠాయించారు. అద్దంకి లో వైసీపీ ర్యాలీ ముగించారని, అందువలన నిరసన కా ర్యక్రమాన్ని ముగించాలని పోలీసులు కోరడంతో రవికుమార్ కూడా తన నిరసన కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చింతల సహదేవుడు, నాగినేని రామకృష్ణ, కరి సుబ్బారావు హరిబాబు, శ్రీనివాసరావు, కాశయ్య పాల్గొన్నారు.