పీర్ల చావిడికి ఎమ్మెల్యే భూమి పూజ

ABN , First Publish Date - 2021-12-25T05:44:27+05:30 IST

మండలంలోని బాదినేనిపల్లి గ్రామంలోని శ్రీ కాశీ స్వామి పీర్ల చావిడి నూతన నిర్మాణ పనులకు గిద్దలూరు ఎమ్మె ల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం భూమి పూజ చేశారు.

పీర్ల చావిడికి ఎమ్మెల్యే భూమి పూజ
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు

కొమరోలు, డిసెంబరు 24 : మండలంలోని బాదినేనిపల్లి గ్రామంలోని శ్రీ కాశీ స్వామి పీర్ల చావిడి నూతన నిర్మాణ పనులకు గిద్దలూరు ఎమ్మె ల్యే అన్నా వెంకట రాంబాబు శుక్రవారం భూమి పూజ చేశారు. బాదినేని పల్లిలోని పాత పీర్లచావిడిని తీసివేసి నూతన చావిడి నిర్మాణ పనులను గ్రామస్థులు చేపట్టారు. మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షుడు కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు దాతల సహకారంతో నిర్మిస్తు న్నారని తెలిపారు. ముందుగా మండల పరిషత్‌ అధ్యక్షురాలు అమూల్య, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి దంపతులు భూమి పూజలో పాల్గొని తొలి ఇటుకను వేశారు. ముస్లిం ఆచారం ప్రకారం ముజావరి సిద్దయ్య, హిందువుల ఆచారం ప్రకారం చావిడి ధర్మకర్త ఓరుగంటి రామకృష్ణ ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముత్తుముల జ యరామిరెడ్డి, తహసీల్దార్‌ నాగూర్‌మీరా, కార్యదర్శి రాజారావు, రమణ య్య, సుబ్బారావు, వీఆర్వో భాస్కర్‌రావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-25T05:44:27+05:30 IST