అట్టహాసంగా ఎమ్మెల్యే బలరాం జన్మదినం

ABN , First Publish Date - 2021-11-01T04:51:10+05:30 IST

ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి జన్మదిన వేడుకలు చీరాలలోని ఎన్‌ఆర్‌ అండ్‌ పీ ఎం హైస్కూల్‌ ప్రాంగణంలోని ఓపెన్‌ ఎయిర్‌ థియే ట ర్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. నియోజకవ ర్గంలోని పార్ఠీ శ్రేణులు, అభిమానులతోపాటు జిల్లా నలు మూలల నుంచి ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌ అభిమాను లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజ రయ్యారు.

అట్టహాసంగా ఎమ్మెల్యే బలరాం జన్మదినం
లాప్‌టాప్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే బలరాం, జడ్పీచైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

చీరాల, అక్టోబరు 31: ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి జన్మదిన వేడుకలు చీరాలలోని ఎన్‌ఆర్‌ అండ్‌ పీ ఎం హైస్కూల్‌ ప్రాంగణంలోని ఓపెన్‌ ఎయిర్‌ థియే ట ర్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగాయి.  నియోజకవ ర్గంలోని పార్ఠీ శ్రేణులు, అభిమానులతోపాటు జిల్లా నలు మూలల నుంచి ఎమ్మెల్యే బలరాం, వెంకటేష్‌ అభిమాను లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజ రయ్యారు. ఈ సందర్భంగా భారీకేక్‌ను ఎమ్మెల్యే బల రాం, వెంకటేష్‌లు పలువురు ప్రముఖులు, వేలాదిమంది నాయకులు, కార్యకర్తల మధ్య కట్‌చేశారు. జడ్పీ చైర్‌ప ర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, కరణం వెంకటేష్‌, ఎంఎస్‌ ఆర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఎక్సిమ్స్‌ ప్రతినిధి మన్నం శ్రీధర్‌బా బు తదితరులు ఎమ్మెల్యే బలరాంకు కేక్‌ను  తినిపించా రు. తదనంతరం వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది బలరాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత స్ధానికులతో పా టు, జిల్లా నలుమూలల నుంచి హాజరైన నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.


పలు సేవాకార్యక్రమాలు


బలరాం జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవాకా ర్యక్రమాలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల సం క్షేమశాఖ ఆధ్వర్యంలో పలువురికి ట్రైసైకిళ్లు, వినికిడి య ంత్రాలను ఎమ్మెల్యే బలరాం, వెంకేటేష్‌, మున్సిపల్‌ చైర్మ న్‌ జంజనం శ్రీనివాసరావు, డాక్టర్‌ వరికూటి అమృతపా ణి, పాలేటా రామారావు చేతుల మీదుగా పంపిణీ చే శారు. అర్హులైన విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందజేశారు. గోలి గంగాధరరావు సహకారంతో సుమారు వెయ్యిమం ది వృద్ధులకు ఎమ్మెల్యే బలరాం చీరలు పంపిణీ చేశారు. అనంతరం పట్టణ పరిధిలో నూతన నిర్మాణాలు, నాడు నేడు మరమ్మతులు, తదితర పనులకు సంబంధించి ఐ దు ప్రదేశాల్లో శిలాఫలకాలను బలరాం ఆవిష్కరించారు.


జాబ్‌మేళాకు విశేష స్పందన


బలరాం జన్మదినం సందర్భంగా ఆదివారం చీరాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభిం చింది. సుమారు 2,526 మంది జాబ్‌ మేళాలో పాల్గొన గా, 32 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.  966 మందిని ఉద్యోగాలకు ఎంపికచేసి అక్కడిక్కడే నియామ కపత్రాలను వైసీపీ నేత కరణం వెంకటేష్‌ చేతుల మీదుగా అందజేశారు. మరో 553 మంది షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నారని స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి లో కనాథం తెలిపారు. 


Updated Date - 2021-11-01T04:51:10+05:30 IST