వెలిగొండపై దుష్ప్రచారం

ABN , First Publish Date - 2021-09-03T05:54:59+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రారంభిస్తే ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తయిందన్నారు. స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని వైఎస్‌ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వెలిగొండపై దుష్ప్రచారం
రిమ్స్‌లోఐసీయూ యూనిట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట, కలెక్టర్‌

ప్రతిపక్ష నేతల తీరుపై మండిపాటు

కేంద్రమంత్రితో మాట్లాడిన సీఎం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 2: వెలిగొండ ప్రాజెక్టుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రారంభిస్తే ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తయిందన్నారు. స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని వైఎస్‌ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. అయితే వెలిగొండ కేంద్ర ప్రకటించిన గెజట్‌లో లేదని టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు అన్నివిధాలుగా కేంద్రం సహకరించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రితో మాట్లాడారని తెలిపారు. 

 

Updated Date - 2021-09-03T05:54:59+05:30 IST