మిర్చి.. మెరిసేనా!

ABN , First Publish Date - 2021-03-23T04:53:59+05:30 IST

ఈ ఏడాది మిర్చి రైతులను అననుకూల వాతావరణం, చీడపీడలు వెంటాడాయి.

మిర్చి.. మెరిసేనా!
ఎండుమిర్చిని గ్రేడుచేస్తున్న మహిళా కూలీలు

పెరిగిన సాగు విస్తీర్ణం

అనుకూలించని వాతావరణం

దెబ్బతీసిన తెగుళ్లు

తగ్గుతున్న దిగబడులు

ధరలపైనే రైతుల ఆశలు

చీరాల, మార్చి 22: ఈ ఏడాది మిర్చి రైతులను అననుకూల వాతావరణం, చీడపీడలు వెంటాడాయి. దీంతో దిగుబడులు తగ్గుతున్నాయి. అయితే, గత కొ ద్దిరోజులుగా ఎండుమిర్చి ధరలో కదలిక రావడంతో రైతులు కొంతఊరట చెందుతున్నారు. రకాన్ని బట్టి క్వింటాకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధరలు పెరగటం అందుకు కారణం. సాధరణ నాటు రకం రూ.12వేల వరకు పలుకుతోంది. తేజ, నంబరు ఫైవ్‌ రకాలు రూ.14వేల వరకు పెరిగాయి. బేడిగ రకం క్వింటా రూ.23వేల వరకు పలుకుతోంది.

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మిర్చి సాగుకు పెట్టుబడులు పెరిగాయి. నిరుడు ఎండు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది సాగువిస్తీర్ణం పెరిగింది. సొంతభూములు ఉన్నవారి తో పాటు కౌలుదారులు కూడా భారీగా సాగుచేప ట్టారు. సాగు తొలినాళ్ళలో వర్షాభావ పరిస్ధితులు వెంటాడాయి. వ్యయప్రయాసలకోర్చి నాట్లువేశారు. తరువాత వర్షాలు ఎక్కువగా కురిశాయి. దీంతో ప ల్లుచేలు దెబ్బతిన్నాయి. ఉరకెత్తాయి. ఈక్రమంలో మిరపనారు ధరకూడా గణనీయంగా పెరిగింది. మ రలా నాట్లు వేసేందుకు పెట్టుబడులు ఆరంభంలోనే భారీగా పెరిగాయి. ఆతరువాత కొంతకాలం వర్షా భావ పరిస్థితులు వెంటాడాయి. దీంతో సాగుదారు లు వ్యయప్రయాసలకోర్చి నీటితడులు అందించారు.  

ఇదిలా ఉంటే గతంకంటే ఎక్కువగా చీడ,పీడలు ఆశించాయి. పురుగు, తెగుళ్ళ మందుల వినియోగా నికి అదనంగా ఖర్చుచేశారు. ఈక్రమంలో ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులు కౌలుఖాతాలో అదనంగా ఎకరాకు రూ.30 నుంచి రూ.35వేలకు ఖర్చుచే శారు. ఈక్రమంలో ఎక రాకు 20 నుంచి 25 క్వింటాళ్ళకు తగ్గకుండా దిగుబ డులు రావాలి. ప్రస్తుతం ఉన్న ధర నిలకడగా ఉం డాలి. లేదంటే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు గణనీ యంగా తగ్గినా ప్రస్తుతం ఉన్న ధరపైనే తాము ఆ శలు పెట్టుకున్నామని చెప్తున్నారు. మిరప ధరలు దిగజారకుండా ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవా లని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-03-23T04:53:59+05:30 IST