తెలంగాణ మంత్రులకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2021-07-08T20:32:38+05:30 IST

వైఎస్‌ను విమర్శించే తెలంగాణ మంత్రులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి బాలినేని అన్నారు.

తెలంగాణ మంత్రులకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి బాలినేని

ఒంగోలు: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే తెలంగాణ మంత్రులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన వ్యక్తి అని కొనియాడారు. వైఎస్‌ను విమర్శించే తెలంగాణ మంత్రులకు పుట్టగతులుండవని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికీ తెలంగాణలోని చాలా ఇళ్లల్లో వైఎస్సార్ చిత్రపటాలు ఉన్నాయన్నారు. రాజకీయ లబ్దికోసం తెలంగాణ మంత్రులు వైఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంత్రి బాలినేని నగరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-07-08T20:32:38+05:30 IST