మిలటరీ హవల్దార్ మృతి
ABN , First Publish Date - 2021-02-27T05:07:34+05:30 IST
రాచర్ల, మండలంలోని చోళ్లవీడు గ్రామానికి చెందిన కోనపల్లి హుస్సేనయ్య(39) మిలటరీలో హవల్దార్‌గా పనిచేస్తూ శుక్రవారం మృతి చెందాడు.

రాచర్ల, ఫిబ్రవరి 26 : మండలంలోని చోళ్లవీడు గ్రామానికి చెందిన కోనపల్లి హుస్సేనయ్య(39) మిలటరీలో హవల్దార్‌గా పనిచేస్తూ శుక్రవారం మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు... కోనపల్లి హుస్సేనయ్య 2019 డిసెంబరులో స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిసిన తరువాత విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ రెజిమెంట్‌కు వెళ్లాడు. ఈ నెల 21న విధులు ముగించుకుని తన రూములో నిద్రపోతుండగా మంచం మీద నుంచి కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. దీనితో అధికారులు మిలటరీ ఆసుపత్రిలో చేర్పించి భార్య కోనపల్లె మౌలాబీకి సమాచారం అందించగా, ఆమె వెంటనే ఢిల్లీ వెళ్లింది. హుస్సేనయ్య చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపగా అక్కడి నుంచి శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో మృతదేహం చోళ్లవీడుకు వచ్చింది. హుస్సేనయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.