దెబ్బతిన్న రహదారి మరమ్మతుకు చర్యలు : ఎంపీపీ

ABN , First Publish Date - 2021-11-23T06:04:08+05:30 IST

మండలంలోని తోటవెంగన్నపాలెం గ్రామం వద్ద దోర్నపువాగు ఉధృతికి దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు తెలిపారు.

దెబ్బతిన్న రహదారి మరమ్మతుకు చర్యలు : ఎంపీపీ
దెబ్బతిన్న కల్వర్టును పరిశీలిస్తున్న ఎంపీపీ

తాళ్లూరు, నవంబరు 22 : మండలంలోని తోటవెంగన్నపాలెం గ్రామం వద్ద దోర్నపువాగు ఉధృతికి దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో దోసకాయలపాడు- తోటవెంగన్నపాలెం గ్రామాల మధ్య ఉన్న దోర్నపువాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో పైపు కల్వర్ట్‌ పూర్తిగా దెబ్బతిని రాక పోకలు స్తంభించాయి. దెబ్బతిన్న కల్వర్ట్‌ను సోమవారం ఎంపీపీ, జడ్పీటీసీలు సందర్శించారు. ప్రస్తుతం గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా యుద్ధప్రతిపదికన మరమ్మతులు చేపడతామన్నారు. ఆ చప్టా మీద నుంచి విద్యుత్‌ తీగలు తక్కువ ఎత్తుల్లో  రాకపోకలకు ప్రమాదకరంగా ఉండడాన్ని గమనించి ప్రజాప్రతినిధులు ఫోన్‌లో విద్యుత్‌ ఏఈ వీరబ్రహ్మంతో మాట్లాడారు. విద్యుత్‌ తీగల మార్పుకోసం వాగుకు దూరంలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వెస్‌.ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ కరిముల్లా, వైసీపీ నేతలు పి.శ్రీకాంత్‌రెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ కూటాల ఆదినారాయణ, వి.వెంకట్రామిరెడ్డి, కైలా్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:04:08+05:30 IST