మట్కా ఆడుతున్న నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-20T05:25:14+05:30 IST

మండల కేంద్రమైన కొమరోలులో ఆదివారం మట్కా ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సాంబశివయ్య తెలిపారు.

మట్కా ఆడుతున్న నలుగురి అరెస్టు


కొమరోలు, డిసెంబరు 19: మండల కేంద్రమైన కొమరోలులో ఆదివారం మట్కా ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సాంబశివయ్య తెలిపారు. మట్కా ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సి బ్బందితో కలసి పట్టణంలో దాడులు నిర్వహించగా కొమరోలు గ్రామానికి చెందిన షేక్‌ జమాల్‌వలి, సయ్యద్‌ రహంతుల్లా, షేక్‌ దాదావలి, దాసరి రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4780 నగదు, నెంబరు స్లిప్పులను  స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సాంబశివ య్య తెలిపారు.  వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-20T05:25:14+05:30 IST