యంత్రపరికరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-31T07:24:38+05:30 IST

ప్రభుత్వం వైఎస్సాఆర్‌ యంత్ర సేవ పథకం ద్వారా రాయితీపై అందిస్తున్న యంత్రపరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు.

యంత్రపరికరాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతులకుయంత్రపరికరాలుఅందజేస్తున్న ఎంపీపీ

తాళ్లూరు, అక్టోబరు 30 : ప్రభుత్వం వైఎస్సాఆర్‌ యంత్ర సేవ పథకం ద్వారా రాయితీపై అందిస్తున్న యంత్రపరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రం వద్ద పలువురు రైతులకు యంత్ర పరికరాలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలోని ప్రతి రైతుభరోసా కేంద్రంలో కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులుకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఏవో బి.ప్రసాద్‌రావు మాట్లాడుతూ..  గతంలో మాదిరిగా కాకుండా ఈ పథకం ద్వారా గ్రూపులకు యాంత్రిక పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు.  ఈ పరికరాలను రైతులకు అద్దె ప్రాతిపధికన అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ పథకం ద్వారా బ్యాంక్‌ రుణం 50శాతం, 40శాతంరాయితీ, 10 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మండలంలో మొదటి విడతగా ఈపథకం కింద రూ9,06,400ల రాయితీ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ పథకం కింద మొదటివిడతగా వెలుగువారిపాలెం, లక్కవరం, శివరాంపురం, తాళ్లూరు గ్రామాల్లో 4 గ్రూపులోని 20 మంది రైతులకు  26,10,000 విలువైన  40 యంత్ర పరికరాలను ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైసీపీ ఇంచార్జి మద్దిశెట్టి రవీంద్రలు రైతులకు అందజేశారు. కార్యక్రమంలో  వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌ చార్లెస్‌ సర్జన్‌, కో-ఆప్షన్‌ సభ్యులు కరిముల్లా, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, సర్పంచ్‌లు చిమటా సుబ్బారావు, పులి ప్రసాద్‌రెడ్డి, వైసీపీ నేతలు యాడిక శ్రీనివాసరెడ్డి, పి.శ్రీకాంత్‌రెడ్డి, కె.వెంకట్రామిరెడ్డి, పులి రమణారెడ్డి, నరసింహారెడ్డి, ప్రసన్నకుమార్‌, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T07:24:38+05:30 IST