మహాపాదయాత్రకు సంఘీభావం తెలపాలి

ABN , First Publish Date - 2021-11-06T05:20:38+05:30 IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే సంకల్పంతో న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టిన రైతులకు కొండపి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం తెలియజేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కొండపి ఎమ్మెల్యే డో లా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణలు విజ్ఞప్తి చేశారు.

మహాపాదయాత్రకు సంఘీభావం తెలపాలి
సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే స్వామి, పక్కన దామచర్ల సత్య, నేతలు

13న కొండపి నియోజకవర్గంలోకి ప్రవేశం

కందులూరు నుంచి ప్రారంభం


కొండపి, నవంబరు 5 :  రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే సంకల్పంతో న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టిన రైతులకు కొండపి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంఘీభావం తెలియజేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కొండపి ఎమ్మెల్యే డో లా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం టంగుటూరు మండలంలోని ఐఓసీ ఎదు రు దామచర్ల టుబాకో కంపెనీ వద్ద నియోజకవర్గంలోని కొం డపి, పొన్నలూరు, మర్రిపూడి, సింగరాయకొండ మండలాల టీడీపీ నాయకులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోకి ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నానికి టంగుటూరు మండలంలోని కందులూరు గ్రామానికి పాదయాత్ర చేరుకుంటుందన్నారు. భోజన అనంతరం మర్లపాడు మీదుగా రాత్రికి  ఎం.నిడమలూరుకు చేరుకుని బస చేస్తారని, 14వ తేదీ పొద్దునే ఆ గ్రామం నుంచి బయలుదేరి అ ల్పాహారానికి కే ఉప్పలపాడు చేరుకుంటారని చెప్పారు. అక్కడ్నుంచి మధ్యాహ్నానికి చిర్రికూరపాడు గ్రామం చేరుకుంటారన్నారు. ఆ తర్వాత విక్కిరాలపేటమీదుగా కందుకూరు నియోజకవర్గంలోకి యాత్ర చేరుకుంటుందని చెప్పారు. యాత్రకు సంఘీభావంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి భాగస్వామ్యం ఉండాలని, భావితరాల కోసం అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దామచర్ల పిలుపునిచ్చారు. హారతులిచ్చి, తిలకం దిద్ది మహిళలు స్వాగతం పలకాలని ఎమ్మెల్యే స్వామి పిలుపునిచ్చారు. ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం ‘మా మద్దతు ఉందని’ చాటే విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా యాత్ర నిర్వాహకులకు సంఘీభావంగా విరాళాలిచ్చి, గ్రామాల్లోకి భారీ స్వాగతం పలకాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు బొడ్డపాటి యల్లమంద నాయుడు, గొర్రెపాటి రామయ్యచౌదరి, బత్తుల నారాయణస్వామి, యర్రమోతు శ్రీనివాసరావు, తుళ్లూరి నరసింహారావు, రేగుల వీరనారాయణ, పొన్నలూరు, సింగరాయకొండ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:20:38+05:30 IST