పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు

ABN , First Publish Date - 2021-05-30T05:43:24+05:30 IST

కరోనా కేసులు నియంత్రించే కా ర్యక్రమంలో భాగంగా నిర్వహించే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ పేర్కొ న్నారు.

పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌

ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ 

కనిగిరి, మే 29: కరోనా కేసులు నియంత్రించే కా ర్యక్రమంలో భాగంగా నిర్వహించే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. కనిగిరి ప్రాంతంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. వీటిని నియంత్రించే దిశగా పలు మార్గా లను అన్వేషించి అమలు చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు కర్ఫ్యూ ఆంక్షలతో పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్ణయం సత్ఫలితాలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన జ్వర సర్వేలో క్షేత్ర స్థాయి సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నా రు. కరోనా బాఽధితులకు వై ద్యం అందించే విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్ద ని సూచించారు. 

కలాం బీఈడీ కళాశాలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితు లకు అన్ని సౌకర్యాలతో పాటు వైద్యం, భోజనం సక్రమంగా అందేలా చూ డాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా రెండో దశలో కనిగిరి ప్రాంతంలో కొంత మంది చనిపోవడం ఎంతో బాధాకరమన్నారు. కర్ఫ్యూ ఆంక్షల్లో  భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న విఽధులు అభినందనీయమన్నారు. సమావేశంలో కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ పీడీ సీనారెడ్డి, సీఐ కె.వెంకటేశ్వర రావు, తహ సీల్దార్‌లు పుల్లారావు, జ్వాలా నరశింహం, సీహెచ్‌ ఉష, సిం గారావు, ఎంపీడీవో మల్లిఖార్జునరావు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీత, డాక్టర్‌ ఏ.నాగరాజ్యలక్ష్మి, ఎస్‌ఐలు రామిరెడ్డి, రాజ్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీహరి, చంద్రశేఖర్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T05:43:24+05:30 IST