లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2021-06-22T06:49:45+05:30 IST

కంభం లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక
డాక్టర్‌ మహబూబ్‌బాషాను సన్మానిస్తున్న లయన్స్‌ సభ్యులు

కంభం, జూన్‌ 21 : కంభం లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా  ఎన్నికైంది. పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో నామినేషన్‌, ఎలక్షన్‌ కమిటీ అధ్యక్షులైన కాలె బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో 2021-22 సంవత్సరానికి లయన్స్‌ క్లబ్‌ నూతన అధ్యక్షునిగా పులి శ్రీనివాసప్రసాద్‌, కార్యదర్శిగా చెరుకుపల్లి శివశంకర్‌, ట్రెజరర్‌గా నాదెళ్ల కేశవులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌ప్రెసిడెంట్లుగా డాక్టర్‌ మహబూబ్‌ బాషా, గంగాధర్‌, మెంబర్‌షిప్‌ చైర్మన్లగా సయ్యద్‌ జాకీర్‌, కటికల భాస్కర్‌, సర్వీస్‌ చైర్‌పర్సన్‌గా మహబూబ్‌బేగ్‌, మార్కెటింగ్‌ చైర్మన్‌గా మీనిగ ప్రసాద్‌, అడ్మినిస్ట్రేటర్‌గా డాక్టర్‌ మహబూబ్‌బేగ్‌లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం కంభం లయన్స్‌క్లబ్‌ అధ్యక్షునిగా సేవలు అందించిన డాక్టర్‌ మహబూబ్‌భాషాకు జిల్లాలో ఉత్తమ ఇంటర్నేషనల్‌ రెసిడెన్సియల్‌ అవార్డు, లీడర్‌షిప్‌ అవార్డు వచ్చిన సందర్భంగా నూతన కమిటీ ఆయనను ఘనంగా సన్మానించారు.


Updated Date - 2021-06-22T06:49:45+05:30 IST