విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-01-13T06:13:45+05:30 IST

student daid with electricity shock

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి


పుల్లలచెరువు, జనవరి 12: విద్యు దాఘాతంతో ఇంటర్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని రంగన్నపాలెంలో జరిగింది. ఇంటరు చదువుతున్న బేతం రామకృష్ణ అనే యువకుడు ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడుక్కోనేందుకు ఇంటి బయట ఉన్న డ్రమ్ము వద్ద నీళ్లు ముంచుతున్నాడు. అదే సమయం లో పక్కనే ఉన్న విద్యుత్‌తీగ షార్టు సర్క్యూట్‌ వచ్చింది. ఆ తీగలకు యువకుడు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు దుఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2021-01-13T06:13:45+05:30 IST