భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయించాలి

ABN , First Publish Date - 2021-08-27T06:35:44+05:30 IST

యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పఽథకం భూసేకరణ ప నులు త్వరితగతిన పూర్తి చే యించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు.

భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయించాలి
ధనుంజయరెడ్డితో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన విజ్ఞప్తి


అద్దంకి, ఆగస్టు 26: యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పఽథకం భూసేకరణ ప నులు త్వరితగతిన పూర్తి చే యించాలని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి తో కలిసి ఆయన గురువారం తాడేపల్లిలో సీఎం  ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిశారు. కొరిశపాడు మండలంలోని యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పఽథకం పూర్తి అయితే పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుం దని,  ఇందుకుగాను భూసేకరణ వేగవంతంగా చేయించాలని కోరారు. ఎన్‌ఎ స్పీ కాలువలు పటిష్టం చేసేందుకు మేజర్‌, మైనర్‌ కాలువల మరమ్మతు పను లు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. 


Updated Date - 2021-08-27T06:35:44+05:30 IST