కుంగిన రోడ్డు..!

ABN , First Publish Date - 2021-05-21T05:06:00+05:30 IST

అనంతపురం - అమరావతి జాతీయ రహదారి అయిన గిద్దలూరు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదురుగా రోడ్డు మధ్యలో కుంగిపోయింది.

కుంగిన రోడ్డు..!

తరచూ ప్రమాదాలు

వాహనదారులకు గాయాలు

చోద్యం చూస్తున్న అధికారులు 

గిద్దలూరు టౌన్‌, మే 20 : అనంతపురం - అమరావతి జాతీయ రహదారి అయిన గిద్దలూరు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదురుగా రోడ్డు మధ్యలో కుంగిపోయింది. దీంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ఘట నలలో అనేక మంది గాయపడుతున్నారు.  ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతుల విషయంలో పట్టించుకోక పోవడం దారుణం. గతంలో పట్టణం మీదుగా వెళ్లే ఈ రోడ్డు మొత్తం సిమెంట్‌ రోడ్డుగా మార్చారు. అయితే  మధ్యలో గ్యాప్‌ ఉండడం వలన పలుచోట్ల కుంగిపోయి ఎత్తుతగ్గులుగా మారింది. ఫారెస్టు ఆఫీస్‌ వద్ద రెండు ప్రాంతాలలో బాగా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు జారి కిందపడుతున్నా రు.  సీపీఎం నాయకుడు సూరా అంకిరెడ్డి ఈ రోడ్డు వెంట వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలై మృతిచెందిన సంఘటన జరిగింది. చాలామంది వాహనదారులు కిందపడి గాయాలైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆప్రాంతంలో ఉండే చిరు వ్యాపారులు రోడ్డు కుంగిన ప్రాంతంలో రాళ్లు పెట్టి ప్రమాదంగా సూచించారు. చిన్నపాటి మరమ్మతులు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు. ఈ రోడ్డు వెంట నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుతున్నప్పటికీ మరమ్మతులపై స్పందించకపోవడం బాధాకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. దెబ్బతిన్న సిమెంట్‌ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగ కుండా చూడాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2021-05-21T05:06:00+05:30 IST