కొణిజేడు, టి.నాయుడుపాలెం.. ప్రతిష్టాత్మకం

ABN , First Publish Date - 2021-02-07T05:18:55+05:30 IST

మండలంలోని కొణిజేడు, తూర్పునాయుడుపాలెం పంచాయతీ ఎన్నికలు ఇరుపార్టీల కు ప్రతిష్టాత్మకంగా మారాయి.

కొణిజేడు, టి.నాయుడుపాలెం..  ప్రతిష్టాత్మకం

రాజీ బెడిసి పోరుకు దిగి

టంగుటూరు, ఫిబ్రవరి 6: మండలంలోని కొణిజేడు, తూర్పునాయుడుపాలెం పంచాయతీ ఎన్నికలు ఇరుపార్టీల కు ప్రతిష్టాత్మకంగా మారాయి. కొణిజేడు విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వగ్రామం కాగా,  టి.నాయు డుపాలెం ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌కు పురిటిగడ్డ. అందుకే ఈ రెండు పంచాయతీ ఎన్నికలు టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి. స్వయంగా మంత్రి చొర వతో కొణిజేడులో రాజీకి ఇరువర్గాల నడుమ ప్రయత్నాలు జరిగాయి. అయితే, అవి బెడిసికొట్టడంతో ఎన్నికలు అని వార్యమయ్యాయి.  కేవలం నాయకుల మధ్య జరిగిన ఈ రాజీ ప్రయత్నాలు రెండువర్గాల ఓటర్లకు సంబంధం లేద ని, ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నట్లు భావిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎవ్వరికివారు ఓటర్లను సమీకరించే పనిలో పడ్డారు.  

అలాగే నాయుడుపాలెం ఎమ్మెల్యే స్వామికి, దామచర్ల జనార్దన్‌కు స్వగ్రామం కావడంతో వారిరువురికి ఇక్కడి విజయం అనివార్యమైంది. నామినేషన్ల దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలతో ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించి గ్రామంపై ఎప్పటిలాగే తమ పట్టు నిలుపుకో వాలని టీడీపీ నాయకులు, పార్టీశ్రేణులు పట్టుదలగా ఉ న్నారు. అధికార వైసీపీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆపార్టీ మరింత పట్టుదలగా ఉంది. ఇ క్కడి విజయం సాధిస్తే ఎమ్మెల్యే స్వామి, జనార్దన్‌కీ షాక్‌ ఇచ్చిన్నట్లువుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య సైతం ఈ గ్రామంలోని ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించా రు. అయితే, గ్రామంలోని వైసీపీలోగల రెండు వర్గాలు చెరో వ్యక్తిని సర్పంచ్‌ బరిలో దించడంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. 

Updated Date - 2021-02-07T05:18:55+05:30 IST