కొండెక్కిన కూరగాయలు

ABN , First Publish Date - 2021-11-24T04:59:27+05:30 IST

కూరగాయలు ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ఉన్నాయి. కేజీ రూ.100 పలుకుతున్నాయి.

కొండెక్కిన కూరగాయలు

కేజీ రూ.వంద పలుకుతున్న వైనం

పేద, మధ్యతరగతి ప్రజలకు తప్పని ఇబ్బందులు

పొదిలి (రూరల్‌), నవంబరు 23: కూరగాయలు ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ఉన్నాయి. కేజీ రూ.100 పలుకుతున్నాయి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పచ్చడి మెతుకులతో  సరిపెట్టుకుంటున్నారు. వేల రూపాయల జీతంతో ఉద్యోగం చేసే వారు సైతం కిలో వద్దు పావుకిలో చాలంటన్నారు. 

సాధారణంగా జనవరి  నుంచి ఏప్రిల్‌ వరకు కూరగాయల ధరలు తగ్గుతుంటాయి. ఈ ఏడాది మార్చి మొదలు కొని నవంబరు వరకు ధర లు భారీగా పెరిగాయి. వంద రూపాయలు తీసుకొని మార్కెట్‌కు వెళితే ఏమి కొనాలో తెలియని అయోమయస్థితిలో వినియోగదారుడు మౌనంగా వెనక్కి వస్తున్నాడు. ఏ కూరగాయలు అడిగినా రూ.వంద చెప్తున్నారు. ఇటీవల కురిసన భారీ వర్షాలతో  కూరగాయల ధరలు మరింత ఘాటె క్కాయి. నెల రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.30 ఉండగా, ఇప్పు డు రూ.100కు పెరిగింది. క్యారెట్‌ కిలో రూ.30, రూ.40 ఉండగా, ప్రస్తు తం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. మిర్చి కిలో రూ.100, కాకర, దొండ, బెండ రూ.60 వరకు ఉన్నాయి. పెద్ద చిక్కుళ్లు, మునక్కా యలు రూ.వందకు చేరాయి. బీరకాయలు రూ.80, వంకాయ రూ.60, దోస రూ.40కి చేరింది. ఈ ధరల పెరుగుదలను చూసి హోటల్‌, కర్రీస్‌ పాయింట్‌ యజమానులు వంటలు తయారు చేయాలంటే బెంబేలెత్తిపో తున్నారు. ధరల పెరుగుదలతో పేదవాడే కాకుండా చిన్నచిన్న హోటళ్లతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న  చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడు తున్నారు.  సామాన్య ప్రజలు ఒక్కపూట కూడా కూరలు వండుకునే పరిస్థితి లేదంటున్నారు. 

రాష్ట్రంలో కూరగాయల ఎక్కువగా పండించే రాయలసీమ ప్రాంతంలో వర్షాలకు దిగుబడులు తగ్గడంతో వేరే  రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమోటాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. 

వ్యాపారం చేయలేం 

- సుబ్రమణ్యం, దుకాణ యజమాని

పెరిగిన కూరగాయల ధరలతో వలన వ్యాపారం చేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఏది కొనాలన్నా కేజీ వంద పలుకుతుండడంతో వినియోగదా రులు కొనకుండానే వెనుదిరుగుతున్నారు.  టమాట  మదనపల్లి, అనంత పురం నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడ  తోటలు దెబ్బతిన్నాయి. సోమవారం మదనపల్లి, అనంతపురం మార్కెట్‌లో 25 కేజీల టమాట బాక్స్‌ రూ.3 వేలుఉంది. అక్కడ కూడా సరుకు లేదు. దీంతో మహారాష్ట్ర  నుంచి సరుకు తెస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి.

హోటళ్లు మూసివేయాల్సిందే 

- లక్ష్మీనారాయణ, మణికంఠ హోటల్‌ యజమాని

అన్నివస్తువుల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల తోపాటు హోట ల్‌కు అవసరమైన ఏవస్తువులూ కొనలేకపోతున్నాం హోటల్‌ నడపాలంటే పెరిగిన ధరలతో కష్టంగా ఉంది. విధిలేని పిరిస్థితుల్లో ప్రత్యామ్నాయంలేక కొనసాగిస్తున్నాం. ధరలు  ఇలాగే ఉంటే హోటల్‌ను మూసివేయాల్సిందే. 


Updated Date - 2021-11-24T04:59:27+05:30 IST