పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

ABN , First Publish Date - 2021-12-31T05:51:32+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతులను ఆదుకోవడానికి కేంద్రం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను వారికి కూడా అందించాలని గతంలోనే నిర్ణయించింది. తొలుత సేద్యం చేసే అన్నదాతలకు మాత్రమే ఈ కార్డు సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్రం తర్వాత దీనిని పాడిరైతులతోపాటు మత్స్యశాఖకు కూడా వర్తింపజేసింది. ఇందులో భాగంగా జిల్లా పశుసంవర్థకశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి పాడిరైతులకు కిసాన్‌ కార్డులను అందిస్తోంది. ఈ డ్రైవ్‌ను నవంబరు 8 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరపాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను చేపట్టి పాడి రైతులకు కిసాన్‌ కార్డులను అందిస్తోంది.

పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
కిసాన్‌ కార్డు (ఫైల్‌)

పశువుల పోషణకు కార్డు ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు

కార్డులు అందించడానికి మూడు నెలల పాటు స్పెషల్‌ డ్రైవ్‌

అవగాహన శిబిరాలతోపాటు క్రమం తప్పకుండా సమీక్షలు

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 30: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతులను ఆదుకోవడానికి కేంద్రం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను వారికి కూడా అందించాలని గతంలోనే నిర్ణయించింది. తొలుత సేద్యం చేసే అన్నదాతలకు మాత్రమే ఈ కార్డు సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్రం తర్వాత దీనిని పాడిరైతులతోపాటు మత్స్యశాఖకు కూడా వర్తింపజేసింది. ఇందులో భాగంగా జిల్లా పశుసంవర్థకశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి పాడిరైతులకు కిసాన్‌ కార్డులను అందిస్తోంది. ఈ డ్రైవ్‌ను నవంబరు 8 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరపాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను చేపట్టి పాడి రైతులకు కిసాన్‌ కార్డులను అందిస్తోంది.

రూ.కోటి వరకు రుణం

2021 మార్చి నుంచి అక్టోబరు వరకు 80వేల మంది పాడిరైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించి రూ.95కోట్లను రుణంగా అందించారు. సాధ్యమైనంత ఎక్కువమందికి కార్డులు అందించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను కేంద్రం చేపట్టిందన్నారు. ఒక గేదె ఉన్నవారికి రూ.54,000, రెండు ఉన్నవారికి రూ.1,08,000లను వాటి పోషణకు రుణంగా అందించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 2020మంది పాడిరైతులు తమకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న 875మందికి కార్డు అందించి రుణం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే కార్డు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

అవగాహన శిబిరాలు, వారం వారం సమీక్ష

కార్డుపై పాడిరైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి శుక్రవారం బ్యాంకు అధికారులతో కలిసి పశుసంవర్థకశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. వచ్చిన దరఖాస్తులు, ఆమోదించినవి ఎన్ని, ఏ కారణాలతో తిరస్కరించారు ఇత్యాది కారణాలన్నింటినీ సమీక్షలో చర్చిస్తున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రుణ పరిమితి పెరుగుతుందని రైతులకు సూచిస్తున్నారు


Updated Date - 2021-12-31T05:51:32+05:30 IST