ఖోఖో రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-30T05:06:06+05:30 IST

ఖేలో ఇండియా ఖోఖో పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ శుక్ర వారం స్థానిక ఎమ్మెస్సార్‌ అండ్‌ బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాలలో ప్రారంభమైంది.

ఖోఖో రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ ప్రారంభం
ట్రయల్‌ రన్‌ను ప్రారంభిస్తున్న శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

 13 జిల్లాల నుంచి  110 మంది క్రీడాకారుల హాజరు

మరోసారి జాతీయ పోటీలు నిర్వహిస్తామన్న  కృష్ణచైతన్య 

పంగులూరు, అక్టోబరు 29:  ఖేలో ఇండియా ఖోఖో పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక ప్రక్రియ శుక్ర వారం స్థానిక ఎమ్మెస్సార్‌ అండ్‌ బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాలలో ప్రారంభమైంది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వారి సహకారంతో ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక ట్రయల్‌ రన్‌ను శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పం గులూరులో ఖోఖో క్రీడకు అపూర్వ ఆదరణ ఉందన్నా రు. ఎంతో మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థా యి క్రీడాకారులను తీర్చిదిద్దిన ఈ మైదానంలో గ్రామ స్థుల సహకారంతో జాతీయ స్థాయి ఖోఖో పోటీలను మరోసారి నిర్వహిస్తామన్నారు. 

ఏకేఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు, ఖోఖో సంఘ రాష్ట్ర కార్య దర్శి ఎం.సీతారామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శాప్‌ పరిశీలకుడు యతిరాజు, చీఫ్‌ కోచ్‌ రాజరాజేశ్వరి, స్టెప్‌ సీఈవో రవికుమార్‌, కాశీవిశ్వనాథరెడ్డి, గిరి ప్రసాద్‌, కోచ్‌ పాపారావు, పౌల్‌, రెఫరీ బోర్డ్‌ చైర్మన్‌ ప్రసాద్‌, గ్రామ సర్పంచ్‌ గుడిపూడి నాగేంద్రం, జడ్పీ టీసీ సభ్యురాలు రాయిణి ప్రమీల, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, ఆర్‌.వి.సుబ్బారావు, గుడిపూడి రామారావు పాల్గొన్నారు. రాష్ట్ర జట్టు ఎంపికకు 13 జిల్లాల నుంచి 110 మంది క్రీడాకారులు హాజరైనట్లు సీతారామిరెడ్డి తెలిపారు. వీరిలో ప్రాథమికంగా 40 మందిని ఎంపిక చేశారు. అనంతరం వ ర్షం కురవడంతో ఎంపిక ప్రక్రి య నిలిచిపోయింది.  శనివా రం జట్టు పూర్తి వివరాలను ప్రకటిస్తామని సీతారామిరెడ్డి చెప్పారు. 

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

అద్దంకి టౌన్‌, అక్టోబరు 29: పట్టణంలోని అన్ని కాలనీల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని శాప్‌ నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య తెలిపారు. శుక్రవారం అద్దంకి నగర పంచాయతీ పరిధిలోని 19వ వార్డులో  అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. కా లువలు సక్రమంగా లేక మురుగునీరు ముందుకు పో వడం లేదని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి ఇబ్బందిగా ఉందని చెప్పా రు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రస్తు తం పట్టణంలోని పలు ప్రధాన రోడ్ల వెంబడి డ్రైనేజీ లు నిర్మిస్తున్నామని, ఇతర ప్రాంతాల్లోనూ త్వరలో పనులు చేపడతామని తెలిపారు. ఖాళీ స్థలాల్లో చెట్లు తొలగించే బాధ్యత వాటి యజమానులదేనని, అధికా రులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 

ఆయన వెంట నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌లు దేసు పద్మేష్‌, కె.అనంతలక్ష్మి, కమిషనర్‌ ఫజులుల్లా,  కౌన్సిలర్‌ వి.నాగరాజు, ఏఈ రోహిణి,  వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నాయకులు దామా హనుమంతరావు, గూడా శ్రీనివాసరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వలం టీర్లు ఉన్నారు. 

Updated Date - 2021-10-30T05:06:06+05:30 IST