కరోనా కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-05T05:59:30+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాక్షికంగా అమలు చేస్తున్న కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కోరారు.

కరోనా కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలి


పొదిలి, మే 4 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాక్షికంగా అమలు చేస్తున్న కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలని  ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కోరారు. మంగళవారం పొదిలిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, అడ్డరోడ్డు వద్ద ఉన్న గుడ్‌షఫర్డ్‌ ఆసుపత్రిని పరిశీలించారు.  ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ సెంటర్లలో బెడ్లు ఖాళీ లేనందున పొదిలిలో అదనంగా మరో సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నట్లు చెప్పారు. ఆయన వెంట వైద్యాధికారులు చక్రవర్తి, రఫీ, నరేంద్ర ఉన్నారు.


Updated Date - 2021-05-05T05:59:30+05:30 IST