కాటేసిన విధి..!

ABN , First Publish Date - 2021-11-29T05:25:49+05:30 IST

ఓ కుటుంబాన్ని కాలం కాటేసింది.. అభం శు భం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను అనాథలను చేసింది.

కాటేసిన విధి..!
అమ్మమ్మతో చిన్నారి వెంకట అఖిలేశ్వరి, అజయ్‌కుమార్‌


కరోనాతో తల్లి, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

అనాథలైన చిన్నారులు

ఆలనాపాలన కోసం అమ్మమ్మ అవస్థలు

ఆదుకోవాలని వేడుకోలు

కొమరోలు, నవంబరు 28 : ఓ కుటుంబాన్ని కాలం కాటేసింది.. అభం శు భం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను అనాథలను చేసింది.  కరోనా ఆ చిన్నారుల తల్లిని బలి తీసుకోగా.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రి కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు ఇద్దరు అ నాథలయ్యారు. ఈ  హృదయవిదారక సంఘటన  కొమరోలు మండలం బా వాపురం గ్రామంలో జరిగింది.  గ్రామానికి చెందిన వెంకట అజయ్‌ కుమార్‌ రెడ్డి (9), వెంకట అఖిలేశ్వరి (4) దీనగాధను వింటే కంటతడి పెట్టాల్సిందే. వీరి తండ్రి వేమారెడ్డి  వెంకట్రామిరెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.   కొద్ది నెలల ముందు తల్లి నాగలక్ష్మి కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. అంతకు ముందే నాయనమ్మ, జేజి నాయనతో పాటు, తాత కూడా ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. ఆ చిన్నా రులకు ఇక మిగిలింది అమ్మమ్మ ముత్యాల భూలక్షమ్మ ఒక్కరే. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆమెది. కూలి పనులు చేసుకుంటూ ఆ ఇద్దరు చి న్నారులను  పెంచుతోంది. వీరి  తల్లిదండ్రులకు ఎలాంటి ఆస్తులు లేవు. తల్లి కరోనాతో, తండ్రి రోడ్డు ప్రమాదంలో వైద్య ఖర్చుల నిమిత్తం బం ధువులు ఆదుకున్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లభించలేదని ఆవేదన చెందుతున్నారు. చిన్నారులను పోషిస్తూ వారి ఆలనా పాలనను చూస్తున్నానని, నా తర్వాత ఎవరు వారిని చూస్తారని అమ్మమ్మ కన్నీరుమున్నీరవుతోంది. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు వేడుకుంటు న్నారు. ఇటీవలె గ్రామాన్ని సందర్శించిన ఎస్‌ఐ సాంబ శివయ్య, ఏఎస్‌ఐ గోపా లకృష్ణ చిన్నారులకు  నూ తన వస్ర్తాలను ఇచ్చి వారిని ఆప్యాయంగా పలుకరిం చారు. చిన్నారులు అజ య్‌ కుమార్‌ రెడ్డి, వెంకట అఖి లేశ్వరిని అన్ని విధాలా ఆదు కోవాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-11-29T05:25:49+05:30 IST